వీధి కుక్కల దాడిలో 14 గొర్రెలు మృతి

వీధి కుక్కల దాడిలో 14 గొర్రెలు మృతి

JN: వీధి కుక్కల దాడిలో 14 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. బాధిత రైతులు కుంట మల్లేష్, అశోక్, దేవయ్య, ఐలయ్యలకు చెందిన చిన్న గొర్రెపిల్లలను ఇంటి వద్ద కట్టేసి వెళ్లగా కుక్కలు దాడి చేసి హతమార్చాయి. సుమారు రూ.70 వేల నష్టం వాటిల్లిందని వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.