ప్రజల్లో చైతన్యం నింపడానికే పల్లెనిద్ర: సీఐ

ప్రజల్లో చైతన్యం నింపడానికే పల్లెనిద్ర: సీఐ

తిరుపతి: ప్రజల్లో చైతన్యం నింపడానికే పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐ జయచంద్ర తెలిపారు. బుధవారం రాత్రి రేణిగుంట మండలం తారక రామనగర్ పోలీసు సిబ్బందతో ఆయన పల్లె నిద్ర చేశారు. గ్రామస్తులకు చట్టాలపై అవగాహన కల్పించారు. యువత గంజాయి, బెట్టింగులు, జూదాలకు దూరంగా ఉండాలన్నారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.