VIDEO: శంకర్ విలాస్ వద్ద ఉద్రిక్తత
GNTR: నగరంలోని శంకర్ విలాస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆంధ్రజ్యోతి వార్తా పత్రికలో వచ్చిన వార్తకు నిరసన తెలిపేందుకు వెళ్తున్న YCP కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో ఘర్షణ చోటుచేసుకుంది. కాగా, ABN రాధాకృష్ణ పత్రికలో YCP అధినేత జగన్‌పై అసభ్యకరంగా వార్తలు రాశారు అనే నేపథ్యంలో YCP కార్యకర్తలు శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.