తణుకు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో.. పురిటి బిడ్డ మృతి

W.G: తణుకు జిల్లా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పురిటిలో బిడ్డ మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత బంధువులు ధర్నాకు దిగారు. నిడమర్రు మండలం పందలపర్రు గ్రామానికి చెందిన లక్ష్మీ దుర్గ ఆదివారం పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరగా, సిబ్బంది పట్టించుకోలేదని, సోమవారం బిడ్డ మృతి చెందడంతో బంధువులు ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు.