యువకుడిపై పోక్సో కేసు నమోదు

యువకుడిపై పోక్సో కేసు నమోదు

అన్నమయ్య: రామసముద్రం మండలం గాజులనగరంలో శుక్రవారం అదృశ్యమైన మైనర్ బాలిక ఓ యువకుడిని వివాహం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. కుటుంబ సభ్యులు యువకుడు తమ కుమార్తెను మోసం చేశాడని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై రమేశ్ బాబు ఈ కేసు వివరాలను వెల్లడించారు.