RSS ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

SKLM: ఆరిలోవ కాలనీలో RSS ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా RSS నాయకులు మాట్లాడుతూ.. షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది అని, ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని, విశ్వావసు సంవత్సరంలో ప్రజలందరు సుఖ-సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం పలువురు టైక్వాండో విద్యార్థులకు ఉగాది పచ్చడి, పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు.