హజ్ యాత్రకు వెళ్లే వారికి ఉచిత వ్యాక్సినేషన్

హజ్ యాత్రకు వెళ్లే వారికి ఉచిత వ్యాక్సినేషన్

వరంగల్ జిల్లాలో హజ్ యాత్రికుల కోసం ఉచిత వ్యాక్సినేషన్ నిర్వహించారు. తెలంగాణ హజ్ కమిటీ, వైద్య ఆరోగ్యశాఖ కలిసి ఐఎంఏ హాల్‌లో ఈ కార్యక్రమాన్ని చేపట్టగా, జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ప్రారంభించారు. యాత్రికులు ఆరోగ్యంగా, సురక్షితంగా యాత్ర పూర్తిచేయాలని, ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.