'పారిశుద్ధ్య డ్రైవ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి'

'పారిశుద్ధ్య డ్రైవ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి'

KMM: గ్రామాలలో నూతనంగా గెలిచిన సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు మార్చి 6 నుంచి 15 వరకు జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లో భాగస్వామ్యం కావాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలుపునిచ్చారు. శుక్రవారం రఘునాథపాలెం రైతువేదిక నందు మండల సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, గ్రామ కార్యదర్శులు, వివిధ శాఖల మండల అధికారులకు అవగాహన కల్పించారు.