'విద్యార్థులు గణితంపై ఆసక్తిని పెంపొందించుకోవాలి'

'విద్యార్థులు గణితంపై ఆసక్తిని పెంపొందించుకోవాలి'

నిర్మల్ అర్బన్ కేజీబీవీని డీఈవో దర్శనం భోజన్న సోమవారం సందర్శించారు. జాతీయ గణిత దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన గణిత ప్రదర్శనను తిలకించారు. విద్యార్థులు గణితంపై ఆసక్తిని పెంపొందించుకోవాలని, గణిత అభివృద్ధి వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని తెలియజేశారు. ప్రదర్శనను తిలకించి, విద్యార్థులను ప్రశ్నించి వారి గిరిజనాభివృద్ధిని పరీక్షించారు.