ఎంపీపీ పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి
సత్యసాయి: రొద్దం మండలం సానిపల్లి గ్రామంలోని ఎంపీపీ పాఠశాలను మంత్రి సవిత ఇవాళ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో ఉన్న సమస్యల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు అదనపు తరగతుల భవనాలు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయించాలని కోరారు. మంత్రి స్పందించి ఈ భవనాలను త్వరలోనే పూర్తీ చేసి అందుబాటులోకి తెస్తామని తెలిపారు.