VIDEO: నలప వారి కుంట చెరువుకు గండి
CTR: సోమల మండలం నలప వారి కుంట చెరువుకు గండి పడిందని స్థానికులు తెలిపారు. తాత్కాలికంగా నీరు నిలిచేటట్లు మరమ్మత్తులు చేశామని తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని కోరారు.లేకుంటే రైతులు నష్టపోతారని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరారు.