ఆదిలాబాద్‌లో యువకుడి దారుణ హత్య
ADB: ఆదిలాబాద్‌లో శుక్రవారం రాత్రి దారుణ హత్యా ఘటన చోటుచేసుకుంది. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారిగూడలో రాజేశ్ అనే వ్యక్తికి మరో వ్యక్తితో గొడవ జరిగింది. ఈ ఘటనలో రాజేశ్ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.