విశేష అలంకరణలో ప్రసిద్ధ మురిడి ఆంజనేయుడు
ATP: డి. హీరేహల్ మండలం మురిడి గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ ఆంజనేయుడు ప్రత్యేక పుష్పాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చాడు. శనివారం ఉదయాన్నే స్వామి వారికి సుప్రభాత సేవ, పంచామృత వివిధ అభిషేకాలు చేపట్టి వెండి కవచం పుష్పాల అలంకరణలో భక్తులకి కనువిందు చేశారు. స్థానిక భక్తులే కాక ఇతర ప్రదేశం నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.