ఫ్రాన్స్ వేదికగా జీ-7 సమ్మిట్.. మోదీకి ఆహ్వానం
ప్రపంచ అగ్రదేశాల వేదిక జీ-7 సదస్సుకు భారత్ మరోసారి సిద్ధమైంది. జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్‌లో జరగనున్న ఈ సమ్మిట్‌కు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, భద్రత, వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాల నేతలతో మోదీ కీలక చర్చలు జరపనున్నారు. అంతర్జాతీయ దౌత్య రంగంలో భారత్ ప్రాధాన్యతను ఈ భేటీ మరోసారి చాటిచెప్పనుంది.