VIDEO: జాతీయ రహదారి పై కమ్మేసిన పొగ..!

VIDEO: జాతీయ రహదారి పై కమ్మేసిన పొగ..!

E.G: దేవరపల్లి మండలం గౌరీపట్నం శివారు జాతీయ రహదారి పై బుధవారం పొగ కమ్మేసింది. సమీప ప్రాంతంలోని పొలంలో రైతు ఎండు గడ్డికి నిప్పు పెట్టడంతో రహదారి పై పొగ కమ్మేసింది. దీంతో వాహనాల రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అలాగే ఆ మంటల వేడికి ద్విచక్ర వాహనాలు అదుపు తప్పే ప్రమాదం ఉండడంతో భయభ్రాంతులకు గురయ్యారు.