కమ్మర్‌పల్లిలో పెద్దపులి సంచారం కలకలం
NZB: కమ్మర్‌పల్లిలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఇటీవల పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బీట్ అధికారిణి శ్రీదేవికి పెద్దపులి కనిపించడంతో ఆమె తీవ్ర షాక్‌కు గురై మూర్చపోయిన ఘటన చోటుచేసుకుంది. అటవీశాఖ అధికారులు అప్రమత్తమై ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి పెద్దపులి ఆనవాళ్లను గుర్తించారు. అదేవిధంగా డ్రోన్ కెమెరాల సహాయంతో అటవీ ప్రాంతాల్లో నిఘాను కొనసాగిస్తున్నారు.