చెక్కపల్లి గ్రామ సర్పంచ్‌గా లక్ష్మీ విజయం
SRCL: వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అడ్డిక లక్ష్మి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసి విజయం సాధించారు. తన గెలుపు సందర్భంగా ఆమె గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, తన విజయానికి సహకరించిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఆమె ప్రత్యేక ధన్య వాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ విప్ శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.