అక్రమ కట్టడాలు కూల్చివేత

అక్రమ కట్టడాలు కూల్చివేత

SKLM: మందస మండలం ఉమాగిరి గ్రామ సమీపాన గల అక్రమ కట్టడాలను అధికారుల బృందం శుక్రవారం కూల్చివేశారు. ఆర్అండ్‌బి రోడ్డు, సునాముది సిస్టం దేశబట్టి చానల్ మీద అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ తహసీల్దార్ కె రామకృష్ణ, ఎస్సై కృష్ణ ప్రసాద్‌లతో కూడిన అధికారులు బృందం స్థలానికి చేరుకొని జెసిబితో అక్రమకట్టడాలను కూల్చివేశారు.