'ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోండి'

'ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోండి'

ప్రకాశం: పొన్నలూరు మండలంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో డాక్టర్ సుజాత మంగళవారం తెలిపారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు మే 10వ తేదీ లోపు OBMMS వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండలంలో అర్హత కలిగిన ఎస్సీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.