VIDEO: కేపీహెచ్‌బీలో ట్రావెల్స్ బస్సు దగ్ధం

VIDEO: కేపీహెచ్‌బీలో ట్రావెల్స్ బస్సు దగ్ధం

HYD: KPHB పరిధిలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. శ్రీదుర్గా మహేశ్వర ట్రావెల్స్‌కు చెందిన AC స్లీపర్ బస్సు నిన్న రాత్రి మియాపూర్ నుంచి పాలకొల్లుకు వెళ్తుంది. ఈ క్రమంలో ఓ బస్‌స్టాప్ వద్ద ఆగి ఉండగా క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను కిందకి దింపడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.