రేపు కాకాణి ఇంటిలో పార్టీ కార్యాలయం ప్రారంభం

రేపు కాకాణి ఇంటిలో పార్టీ కార్యాలయం ప్రారంభం

NLR: మాజీమంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసంలో శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభమవుతున్నట్లు రూరల్ నియోజకవర్గం ఇంఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి రూరల్ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఉదయం 9:30 గంటలకు పూజా కార్యక్రమం జరగనుంది.