రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
PLD: దాచేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ వెంకట్ నాయక్ మృతి చెందారు. నరసరావుపేట నుంచి దాచేపల్లికి బైక్‌పై వెళ్తుండగా యూటర్న్ తీసుకుంటున్న లారీని ఆయన ఢీకొట్టారు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను దాచేపల్లి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం పిడుగురాళ్ల తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు.