కాలాష్టమి సందర్భంగా కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు
HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలో, శ్రీ శివాలయం ప్రాంగణములో గల శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో, నవంబర్ 28వ తేదీ 2025 ఈ రోజు, కాలాష్టమి సందర్భంగా శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారిని శ్వేత వస్త్రముతో, పూలమాలతో, రుద్రాక్ష మాలతో, నుదుటిన చందన కుంకుమ తిలకాలతో మందార పూలతో అలంకరించారు. భక్తులు బూడిద గుమ్మడికాయలతో దీపారాధన చేశారు.