VIDEO: కాజ్‌వేను ముంచెత్తిన వరద నీరు

కోనసీమ: వరద ప్రవాహం ఉదృతంగా ప్రవహిస్తున్న సందర్భంగా మామిడికుదురు మండలం అప్పనపల్లిలో ఉన్న కాజ్వే శుక్రవారం ఉదయానికి ముంపునకు గురైంది. కాజ్‌వేపై రెండు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో అప్పనపల్లి, బి. దొడ్డవరం, పెద్ద పట్నం లంక గ్రామాలకు రోడ్డు మార్గం పూర్తిగా స్తంభించింది. అధికారులు అప్రమత్తమై కాజ్‌వే వద్ద పరిస్థితిని గమనిస్తున్నారు.