అకాల వర్షానికి నేలరాలిన మామిడి పండ్లు

అకాల వర్షానికి నేలరాలిన మామిడి పండ్లు

MNCL: నెన్నెల మండలంలోని చిన్న వెంకటాపూర్, కొత్తూరు గ్రామాల్లో గురువారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం కారణంగా కోత దశకు వచ్చిన మామిడి పండ్లు రాలిపోయాయి. పలు చోట్ల వరిపంట నేలకొరిగింది. అకాల వర్షం వల్ల తమకు తీవ్రనష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పంట నష్టంపై సర్వే చేసి నష్టపరిహారం అందేలా చూడాలన్నారు.