రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
KNR: తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్ వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన ప్రమాదంలో పండుగ రాణా ప్రతాప్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, వారం రోజుల క్రితమే వివాహం చేసుకున్న ఈ యువకుడిని మృత్యువు కబలించడం పెళ్లి ఇంట పెను విషాదం నింపింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని బైక్‌పై వెళ్తూ ఢీకొన్న ఈ ఘటనలో నవవరుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.