సీపీకి జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ నోటీసు

WGL: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌కు జరిగిన వేధింపుల ఘటనలో విచారణ చేసి వారం రోజుల్లో పూర్తి వివరాలను పంపించాలని వరంగల్ పోలీస్ కమిషనర్‌కు ఎస్సీ జాతీయ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ జి. సునిల్ కుమార్ గురువారం నోటీసు పంపారు. ఈ నెల 17న బాధితుడు శ్రీధర్ తనకు జరిగిన వేధింపులపై ఎస్సీ జాతీయ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.