రూ.లక్ష డిమాండ్ చేసిన టీపీసీసీ కో-ఆర్డినేటర్..?
VKB: నవాబుపేట(M) మల్లారెడ్డిపల్లిలో ఒక ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని నమ్మించి, టీపీసీసీ కో-ఆర్డినేటర్ ధారా భాస్కర్ తన వద్ద నుంచి రూ.లక్ష డిమాండ్ చేశాడని గూళ్ళ కేశవులు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది ఇప్పటికే రూ.50 వేలు వసూలు చేసిన భాస్కర్, మిగిలినవి కూడా ఇవ్వాలని ప్రస్తుతం వేధిస్తున్నాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.