సీఎంను కలిసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

NGKL: అచ్చంపేట నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు కోసం సీఎం రేవంత్ రెడ్డిని పీసీసీ ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మంగళవారం సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని మన్నెవారిపల్లి హైలెవెల్ వంతెన నిర్మాణాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అచ్చంపేట పట్టణంలో బాలుర జూనియర్ కాలేజ్‌కి కొత్త భవనం కోసం వినతి పత్రం అందజేశారు.