దెబ్బతిన్న పంటలను పరిశీలించిన టీడీపీ ఇన్‌ఛార్జి

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన టీడీపీ ఇన్‌ఛార్జి

KRNL: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అరికెర గ్రామంలోని పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శుక్రవారం దెబ్బతిన్న పంట పొలాలను గ్రామంలోని రైతులతో కలిసి ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి పరిశీలించారు. పంట నష్టం వల్ల కష్టాల్లో ఉన్న రైతు సోదరులకు ప్రభుత్వం తరఫున తగిన సహాయం అందేలా చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.