VIDEO: యూరియా కొరత.. రైతులు ఆందోళన

VIDEO: యూరియా కొరత.. రైతులు ఆందోళన

BHPL: టేకుమట్ల మండలం పంగిడిపల్లి గ్రామంలోని రైతు వేదికలో ఆదివారం ఉదయం యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 5 గంటల నుంచి క్యూలలో నిలబడి ఎదురుచూసినా, పంటల సాగుకు కీలకమైన యూరియా సమయానికి అందకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గోసలను అధికారులు గమనించి, తక్షణమే సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.