ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

శ్రీకాకుళంలోని నైరా వ్యవసాయ కళాశాలలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  అసోసియేట్ డీన్ డా. జి. జోగినాయుడు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులు అర్పించి, ఆయన సేవలను స్మరించారు. సమానత్వం కోసం ఆయన చేసిన కృషి ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.