'బ్లూ జెట్ ఫార్మా కంపెనీని రద్దు చేయాలి'

'బ్లూ జెట్ ఫార్మా కంపెనీని రద్దు చేయాలి'

AKP: అచ్యుతాపురం మండలం పూడిమడక సమీపంలో ఏర్పాటు చేస్తున్న బ్లూ జెట్ ఫార్మా కంపెనీని రద్దు చేయాలని గురువారం మత్స్యకారులు డిమాండ్ చేశారు. వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి జగన్ ఆధ్వర్యంలో పూడిమడకలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కంపెనీ కారణంగా కాలుష్యం మరింత పెరుగుతుందని దీనివల్ల మత్స్యకారుల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. తక్షణం పనులను నిలిపివేయాలన్నారు.