VIDEO: ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రొఫెసర్ల ర్యాలీ
MDCL: తెలంగాణలోని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు యూజీసీ పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి పరిపాలన భవనం వరకు వారు ర్యాలీ నిర్వహించారు. అధికారులు బేసిక్ పే, డీఏ, హెచ్ఆర్ఏతో కూడిన పేస్కేళ్లను వెంటనే ఇవ్వాలన్నారు.