హ్యాండ్‌బాల్‌లో జిల్లాకు తృతీయ స్థానం
సత్యసాయి: పల్నాడులో జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలలో జిల్లా జట్టు తృతీయ స్థానం సాధించింది. ఈ జట్టులో ప్రతిభ కనబరిచిన జగరాజుపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఓం శ్రీ, ఫర్హాన జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థినుల విజయం పట్ల పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.