VIDEO: నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన ఉపాధ్యాయులు
KDP: మదనపల్లె తాహసీల్దార్ కార్యాలయం వద్ద ఎపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన నిరాహార దీక్ష 3.0 కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కె. హేమలత మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.