'పుంగనూరు రైతులకు పరామర్శ'

CTR: పుంగనూరు నియోజకవర్గంలో సోమవారం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ చిన్న రాయల్ పర్యటించారు. సదుం, పులిచెర్ల, రొంపిచర్ల మండలాల్లో ఏనుగుల దాడిలో నష్టపోయిన రైతులను పరామర్శించి పంటను పరిశీలించారు. రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా అటవీశాఖ అధికారులతో మాట్లాడి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.