పెద్దాయపల్లిలో పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభం

పెద్దాయపల్లిలో పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభం

MBNR: బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి సమీపంలో సుమారు రూ. 200 కోట్ల నిధులతో మెగా కంపెనీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణ పనులను జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జడ్చర్ల నియోజకవర్గానికి విద్యా రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.