వరకట్న వేధింపుల కేసు.. ముగ్గురికి జైలు శిక్ష..!
కృష్ణా: వరకట్న వేధింపుల కేసులో భర్తతో పాటు అత్త, మామలకు గుడివాడ కోర్టు గురువారం జైలు శిక్ష విధించింది. పెదపారుపూడి శివారు చింతలమాలపల్లికి చెందిన మహిళ ఫిర్యాదుతో నమోదైన కేసులో నిందితులు శారీరక, మానసిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైంది. అదనపు కట్నం కోసం బాధితురాలిని ఇంటి నుంచి పంపించివేసిన ఘటనపై విచారణ జరిపిన కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.