ఖాళీ బిందెలతో మహిళలు నిరసన
AKP: రావికమతం మండలం కొత్తకోట దళిత కాలనీలో మంచినీటి సమస్యను తీర్చాలని మహిళలు ఖాళీ బిందెలతో బుధవారం నిరసన చేపట్టారు. ఈ కాలనీలో జల జీవన్ మిషన్ ద్వారా మంచినీటి కొళాయిలు ఏర్పాటు చేసిన ఇప్పటికీ మంచినీరు అందించని పరిస్థితి ఉందని వాపోయారు. దీంతో నీటికి అవస్థలు పడుతున్నామని, తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు.