బాలికపై అఘాయిత్యం.. కేసు నమోదు
KNR: జిల్లాలో సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జమ్మికుంటకు చెందిన ఓ మైనర్ బాలికపై సమీప బంధువులు, పాఠశాల సిబ్బంది కొంత కాలంగా లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. దీన్ని ఎవరికైనా చెప్తే చంపుతామని యువతిని బెదిరించారు. తాజాగా బాధితురాలు తన గోడును లేఖలో రాయడంతో విషయం బయటపడింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు 13 మందిపై పోక్సో కేసు నమోదు చేశారు.