అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే

GDWL: జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఒక ఇంకుడు గుంతకు రూ.7000 ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం గద్వాల మండలంలో అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది గ్రామాలకు కొత్తగా సిసి రోడ్లు, భూగర్భ జలాలు పెంపొందించే విధంగా ఇంకుడు గుంతలు, మురుగు కాలువలను నిర్మించడం జరుగుతుందన్నారు.