VIDEO: భూ వివాదం.. అత్తపై కోడలు దాడి
యాదాద్రి: తుర్కపల్లి మండలం గోపాలపురంలో భూ వివాదం కారణంగా అత్త కృష్ణమ్మపై కోడలు రాజేశ్వరి దాడి చేసింది. ఇటీవల కొడుకు మరణించడంతో కృష్ణమ్మ కూతురు మంజులకు ఎకరం భూమి ఇవ్వాలని తీర్మానం చేశారు. ఈ విషయంపై ప్రశ్నించినందుకు భూమి ఇవ్వను అంటూ కోడలు దాడి చేయడంతో అత్తకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.