డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ ఏర్పాట్లు పరిశీలన

GDWL: గద్వాల మండలంలోని దౌలత్‌పీర్ దర్గా వద్ద నిర్మాణం పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు ఇవాళ పరిశీలించారు. ఈ నెల 6న రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నట్లు తెలిపారు.