ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు
MHBD: నర్సింహులపేటలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడిన దొడ్డి కొమురయ్య సాహసాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.