సీఎం రిలీఫ్ ఫండ్ పంపీణి చేసిన ఎమ్మెల్యే
E.G: కాళ్ల మండలం పెద అమిరం ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఉదయం 31 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 14 లక్షల 40 వేలు అందచేసినట్టు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. పేదలపట్ల కూటమి ప్రభత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. నిధుల కొరత ఉన్నప్పటికీ ఆరోగ్యదృష్ట్యా ఈ చెక్కులు లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నట్టు తెలియజేశారు.