సివిల్ సప్లయ్ అధికారుల దాడులు.. సిలిండర్లు సీజ్
NLG: దేవరకొండలో చికెన్ సెంటర్లు, హోటల్స్, బేకరీలలో సివిల్ సప్లయ్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. వారి నుంచి 27 సిలిండర్లను సీజ్ చేసి గ్యాస్ గోదాములో భద్రత నిమిత్తము అప్పగించారు. వాణిజ్య సంస్థల వారు అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్‌లను వాడవద్దని హెచ్చరించారు. ఈ తనిఖీలలో సివిల్ సప్లయ్స్ అధికారులు, ఓఎస్డీ బొడిగె అంజయ్య ఉన్నారు.