జిల్లా కేంద్రంలో నేడు నెట్ బాల్ జట్ల ఎంపికలు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మైదానంలో నేడు 8వ రాష్ట్రస్థాయి జూనియర్, సీనియర్ నెట్ బాల్ జట్ల ఎంపికలను నిర్వహించనున్నట్టు జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు విక్రమ్ ఆదిత్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2007 జూన్ 31 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉదయం 10 గంటలకు స్టేడియంలో కోచ్ అంజాద్ అలీకి రిపోర్టు చేయాలని సూచించారు.