ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి: చంద్రబాబు

ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి: చంద్రబాబు

AP: మత్స్య పరిశ్రమలో ఏపీ ముందంజలో ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. రేర్ ఎర్త్ మెటల్స్ కూడా ఏపీలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో గండికోట, బుద్ధుని ప్రదేశాలు, పురాతన ఆలయాలు వంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని చెప్పారు. కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయి అనేది అవాస్తవం అని.. దానివల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.