గీసుకొండలో మిస్సింగ్ కేసులు 96 శాతం ఛేదన
WGL: గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది 27 మంది మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 26 కేసులను పోలీసులు సత్వరం ఛేదించి, తప్పిపోయిన వ్యక్తులను కుటుంబాలకు కలిపారు. 18 మంది మహిళలు, 5 మంది పురుషులు, 3 బాలికలు, ఒక బాలుడు ఇళ్ల నుంచి వెళ్లిపోయారని ఫిర్యాదులు అందాయి. సీఐ విశ్వేశ్వర్ నేతృత్వంలో పోలీసులు చురుకుగా వ్యవహరించి 96 శాతం కేసులు పరిష్కరించారు.